
పయనించే సూర్యుడు అక్టోబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా,మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యవసర కిట్లు,దుప్పట్లను పంపిణీ చేశారు. ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి,డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ,సేవా సంకల్ప్ మండల కన్వీనర్లు పోలవరం వీర వెంకట సత్యనారాయణ,కర్రీ శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ చూపిన పరిశుభ్రత,సేవా మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. గ్రామ పరిశుభ్రతలో పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.