రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రుద్రూర్ మండల నూతన కార్యవర్గాన్ని మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ అధ్యక్షతన నియమించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు గౌటి కళ్యాణి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు ఓదెల సతీష్ పవార్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షులు రేపల్లి సాయిప్రసాద్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బేగరి సాయికుమార్, మండల ఉపాధ్యక్షులు ఎం.వి. కృష్ణంరాజు, గుడిసే ప్రభాకర్, కొండలవాడి సాయిలు, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆశం రాములు, మండల కార్యదర్శులు ఎర్రోళ్ల శంకర్, బేగరి శివప్రసాద్, జీలకర్ర విజయ్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు హరికృష్ణ మాట్లాడుతూ.. అందరూ పార్టీ బలోపేతానికి, పటిష్టతకు కృషి చేయాలని, పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తల బాగోగులు చూస్తుందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి బోజగొండ అనిల్, నాయకులు కటికె రాంరాజ్, కుర్లెపు గంగాధర్, గణేష్, వెంకటేష్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.