సినిమా వార్తలు

ప్రజలను అనునిత్యం చైతన్య పరుస్తున్న నిజామాబాద్ పోలీస్ కళాబృందం.

ప్రజలను అనునిత్యం చైతన్య పరుస్తున్న నిజామాబాద్ పోలీస్ కళాబృందం.

పయనించే సూర్యుడుD.01.10.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. మాదకద్రవ్యాల వైపు యువత మొగ్గుచూపకుండా చర్యలురోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తం , మహిళల రక్షణకోసం కొత్త చట్టాలపై అవగాహణజనవరి నుండి సెప్టెంబర్ వరకు 106 అవగాహణ కార్యక్రమాల నిర్వాహణ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలలో గల గ్రామాలకు పోలీస్ కళాబృందం వెళ్లి ప్రజలను చైతన్య పర్చడం జరుగుతుందని * నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్* తెలియజేశారు.పోలీస్ సిబ్బంది ఒక కళాబృందముగా ఏర్పడి ప్రతీ పల్లెలో తీవ్రతరమైన సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, మహిళల రక్షణ , ముఢనమ్మకాల పై అవగాహన కల్పిస్తూ , ప్రజలను కొంత మంది స్వార్ధ పరులు వారి యొక్క బలహీనతను సొమ్ము చేసు కుంటునారన్న సమాచారం మేరకు ప్రజల మనస్సులో ఇంకా పటిష్టoగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ కళాబృందం వినూత్న ప్రచార పద్ధతులను చేపట్టింది. పలెల్లల్లో , పట్టణాల్లో సాగుతున్న ఈ కార్యక్రమాల్లో కళా బృందం పాటల నాటకాల రూపంలో ప్రజలను అలరిస్తూనే , మోసపూరిత మానసిక దోపిడి నుంచి వారిని కాపాడే సందేశానీ చక్కగా విరబూస్తోంది. నిజామాబాద్ పోలీస్ వ్యవస్థ ఒక పేరు” పోలీను కళా బృందం ” ఇందులో భాగంగా ప్రజల జీవితాలలో వెలుగు నింపుటకు స్వచ్చంద కార్యక్రమం చేపట్టింది. అట్టి స్వచ్చంద పోలీసు వ్యవస్థ వీరు ప్రతీ పల్లె పల్లెలు తిరిగి రాత్రి ఆనక, పగలు అనక ప్రజలకు పాటల రూపంలో మరియు నాటక రూపాలలో పీడిత ప్రజలను చైతన్య పరుస్తూ వారి బయందోళనలను పారద్రోలివారి యొక్క జీవితాలలో వెలుగు నింపటముతో నిజామాబాద్ పోలీస్ కళా బృందం సభ్యులు అహార్నిషలు కృషి చేస్తున్నారు.ఈ పోలీస్ కళాబృందం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సమాజంలో తప్పులు,నేరాలు జరుగకుండా ముందస్తుగా ప్రజలలో పాటలు మరియు నాటకాల రూపంలో చైతన్యం కలిగించడం ఇందులో ప్రధానంగా పోలీస్ కళాబృందం చైతన్య పరుస్తున్న అంశాలు కల్తీ కల్లు వద్దు జీవితం ముద్దు, కల్తీ కల్లువలన అనారోగ్యానికి గురవుతారని 2)రోడ్డు భద్రతపై అవగాహన: ముఖ్యంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం హెల్మేటు పెట్టు కోకపోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం. అతి వేగంగా వెల్లడం, మద్యం సేవించి వాహానం నడపటం, రాంగ్ రూట్లో వెల్లడం,ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబందనలు ప్రతీ ఒక్కరు పాటించాలని రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రతీ ఒక్కరి ప్రధాన కర్తవ్యం మహిళల రక్షణ కోసం ప్రస్తుతం కొత్త చట్టాలపై మహిళలకు అవగాహణ, వారి రక్షణే ప్రధాన ధ్వేయం మహిళలు ఏవైనా అసౌకర్యానికి గురైనప్పుడు షీ టీమ్ నెంబర్ 87126-59795 లేదా డయల్ 112 కు కాల్ చేసి సద్వినియోగం చేసుకోవాలని మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు: CEIR పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేయించుకోవచ్చు అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సేవల కోసం డయల్ 112 ఉపయోగించుకోవాలని ఆన్లైన్ మోసాల పై హెచ్చరిక సైబర్ మోసాల నుండి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండండి. ఏదైనా మోసానికి గురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు ఫోన్ చేయాలని మాదకద్రవ్యాల వినియోగం నేరం చట్టపరమైన శిక్షకు లోనవుతారు. యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే 908 కు అందించగలరు. యు వత చెడు దారుల్లో వెల్లకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రతీ గ్రామంలో సి.సి కెమెరాల ఏర్పాటు వాటి సంరక్షణ చైన్ స్నాచర్ల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగు వాటిపై పాటలతో, నాటకాలతో, మాటలతో ప్రజలకు అర్ధం అయ్యే విధంగా అవగాహాణ కల్పించడం జరుగుతుంది.నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారు జనవరి 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు 106 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ కళాబృందానికి అన్ని గ్రామాలలో ప్రదర్శన సమయంలో మంచి స్పందన వస్తుందని , ప్రజల లో చైతన్యం తీసుకొని రావడం మాత్రమే మా ప్రధాన కర్తవ్యం అని ప్రధానంగా సామాజిక అంశాలు, చట్టాలు, హక్కులపై చాలా మందికి అవగాహాన కల్పించడం జరిగిందని, నూతన పద్ధతులతో ప్రజలలో కి వెలు తున్నారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్* వెల్లడించారు.ఈ కళాబృందం పర్యటనల వలన ప్రతీ గ్రామాలలో ఎంతో మార్పూరావడం జరుగుతుంది. ఆన్లైన్ మోసాల గురించి కూడా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. సైబర్ నేరగాండ్ల బారీన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నారు.

    ఇ-పేపర్

    PAYANINCHE SURYUDU NEWS