పయనించే సూర్యుడు అక్టోబర్ 13: ముమ్మిడివరం ప్రతినిధికాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ తిల్లపూడి నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. మంగళవారం అమలాపురంలోని జిల్లా బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, జిల్లా ఇన్ఛార్జ్ కారంకి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ గుంటూరు జిల్లా ఇంచార్జ్ యాళ్ల దొరబాబు ముమ్మిడివరం మార్కెటింగ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ తిల్లపూడి నాగేశ్వరరావుకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరికతో సుంకరపాలెం ప్రాంతంలో బీజేపీ బలోపేతానికి మరింత అవకాశం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.