ఆంధ్రప్రదేశ్

మగసానితిప్ప, మగసానితిప్ప కాలనీ, బైరవలంక వన సంరక్షణ సమితులకు రూ.15,40,299 విలువైన చెక్కుల పంపిణీ

మగసానితిప్ప, మగసానితిప్ప కాలనీ, బైరవలంక వన సంరక్షణ సమితులకు రూ.15,40,299 విలువైన చెక్కుల పంపిణీ

పయనించే సూర్యుడు అక్టోబరు 13: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన మండలంలోని మగసానితిప్ప వన సంరక్షణ సమితి, మగసానితిప్ప కాలనీ వన సంరక్షణ సమితి, బైరవలంక వన సంరక్షణ సమితులకు ఐటీడీఏ శాఖ ఆధ్వర్యంలో తోటలను అభివృద్ధి చేసినందుకు ఆర్థిక ప్రోత్సాహకంగా మొత్తం రూ.15,40,299 విలువైన చెక్కులను అందజేశారు.ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐటీడీఏ శాఖ అధికారి సమక్షంలో ఈ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ వన సంరక్షణ సమితులకు అందించిన నిధులను సామాజిక వనాల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ఐటీడీఏ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన తోటలను సంరక్షిస్తూ, పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక ప్రోత్సాహకాలను సమర్థవంతంగా వినియోగించి, గ్రామాలకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐటీడీఏ శాఖ అధికారి నగిడి నాగేశ్వరరావు, దాట్ల పవన్, సత్యం, ఇతర కూటమి నాయకులు, వన సంరక్షణ సమితుల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS