పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భరత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు, మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి, కమిటీ సభ్యులను అభినందించారు.కార్యక్రమంలో భాగంగా సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి, కమిటీ సభ్యులకు జ్ఞాపికలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాలనీ అభివృద్ధి, స్థానికుల సంక్షేమం కోసం సంఘం చేస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా అభినందించారు.సంఘం ఉపాధ్యక్షులు నాగేశ్వర్ రావు, బాబు, నరేష్ కుమార్, మధు, వెంకటేష్ యాదవ్, లలిత యాదవ్, అపర్ణ చౌదరి, డేవిడ్, మూర్తి, బిక్షపతి గౌడ్, సత్యనారాయణ, రాంబాబు, వెంకటేష్, సంతోష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.అలాగే స్థానిక కూకట్‌పల్లి నాయకులు కొండారెడ్డి, సతీష్ రెడ్డి, సంజీవరావు తదితరులు హాజరై సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కమిటీ సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ ప్రజల ఐక్యతతో సంక్షేమ సంఘం మరింతగా అభివృద్ధి చెంది, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.