పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నగరంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయం ఎదుట సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మూసాపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చును పాషా ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను అరెస్టు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా సంబంధిత అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఓటర్ల జాబితా, పరిశీలన ప్రక్రియకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ధర్నా సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నవాజ్, పాషా, సల్మాన్, ఖాజా, మహేష్ యాదవ్, సంతోష్, హమీర్, షాకీర్, హుస్సేన్, అస్లాం ఫర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.