పయనించే సూర్యుడుD.03.10.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. భీంగల్ మండలం జాగిరాల పిప్రి పల్లికొండ బడా భీంగల్ చేయంగల్ గ్రామాల్లో నిర్మించిన పల్లె దావఖన హెల్త్ సబ్ సెంటర్ లను డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ రవీందర్ మరియు ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ సంయుక్తంగా సందర్శించి సౌకర్యాలు పరిశీలించారు..
జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం హెల్త్ sub సెంటర్ లను నిర్మించి కాంట్రాక్టర్ చేసిన పనులు.. మిగిలిపోయిన పనులు.. పరిశీలన చేసి సబ్ సెంటర్ బిల్డింగ్ వినియోగంలోకి వచ్చే విధంగా Dy DMHO మరియు ఎంపీడీవో పరిశీలన చేసి రిపోర్ట్ సమర్పించుటకు ఈరోజు క్షేత్రస్థాయిలో సందర్శించినారు..పల్లె దావఖానా లు ఉపయోగంలోకి రావడానికి విద్యుత్ సౌకర్యం టాయిలెట్ సౌకర్యం నీటి సౌకర్యం ఇతర సౌకర్యాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కి రిపోర్టు సమర్పించి త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలోDy. DMHO రవీందర్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మెడికల్ ఆఫీసర్ అజయ్ గ్రామ సర్పంచులు హెల్త్ అధికారులు సాయన్న పంచాయతీ కార్యదర్శులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు