తెలంగాణ

ఇండియా కూటమి ఆధ్వర్యంలో అక్టోబర్ 7 న నిరసన ర్యాలీ.

ఇండియా కూటమి ఆధ్వర్యంలో అక్టోబర్ 7 న నిరసన ర్యాలీ.

పయనించే సూర్యుడుD.03.10.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇండియా కూటమిలో ఉన్న మిత్ర పక్షలతో కలిసి శనివారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్ పల్లి నగేష్ రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతు కేంద్ర ఎన్నికల సంఘము నిర్వహిస్తున్న సర్ కార్యక్రమం పూర్తిగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉందని, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలనీ అఖిల పక్షం తరుపున డిమాండ్ చేస్తునమాని, ఆయనను తొలగించేతవరకు ఈ వారం రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ మరియు మిత్ర పక్షాలతో కలిసి వివిధ రూపాలలో నిరసనలు చేస్తామని తెలిపారు.దేశ ప్రధాని మోదీ, అమిత్ షాకి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తోత్తుగా వ్యవహారిస్తునరాని, రాష్ట్రములో ఈ సర్ ప్రోగ్రాంలో కొన్ని లక్షల మంది ఓట్లు తొలగించారని,వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మరియు మిత్ర పక్షాలు తీసుకుంటాయని ఈ సందర్బంగా తెలిపారు.స్వాతంత్రం వచ్చి 79సంవత్సరాలలో దేశంలో అనేక పార్టీలు దేశాన్ని పాలించయని ప్రతి 10సంవత్సరాలకు ఒకసారి ఓటర్ల సవరణను చేస్తారని దాంట్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం మరియు కేంద్ర ఎన్నికల సంఘము రెండు కలిసి బీజేపీ కి అనుకూలంగా ఉన్న ఓట్లను ఉంచి మిగతా ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ గారు ఈ సర్ వల్లనే ఓడిపోయారని ఈ విధంగా అన్ని రాష్టాలలో అమలు చేసే ప్రయత్నం బీజేపీ మరియు కేంద్ర ఎన్నికల సంఘము చేస్తున్నాయని మండిపడ్డారు. జాతీయ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం,మంగళవారం నాడు మండల కేంద్రాలలో ధర్నా కారక్రమాలు నిర్వహించడం జరుగుతుంది,బుధవారం రోజు జిల్లా కేంద్రంలో బారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ , రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్ సీపీఐ ఏం ఎల్ వనమాల కృష్ణ , RSP జిల్లా కార్యదర్శి కటారి రాములు గారు, సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు , సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు సీపీఐ ఏం ఎల్ నగర కార్యదర్శి సుధాకర్ , సయ్యద్ ఫెరోజ్ అలీ రఘురామ్ పిట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS