రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో బుధవారం బతుకమ్మ సంబరాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ గుడి, ఊరడమ్మా గుడి, గాంధీ చౌరస్తాలో బతుకమ్మలను పెట్టి బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందిగామ సుమలత కృష్ణ, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ పట్ల సురేష్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం,మాజీ సర్పంచ్ బాపూజీ సావిత్రి లింగం, కురుమజి సాయిలు, బాపూజీ లింగం, పట్ల సంతోష్ పటేల్, పట్ల శ్రీకాంత్, ఎర్రోళ్ల సురేందర్, కుర్మాజీ గంగారం,నారోజీ లచ్చయ్య మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.