CDMA ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి భీంగల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు.
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్.భీంగల్: పట్టణ పరిపాలన, మున్సిపాలిటీ చట్టాలు మరియు ప్రజా పాలన పై అవగాహన మరియు స్వచ్ఛ సర్వేక్షన్ మరియు మున్సిపల్ రెవిన్యూ పై మరియు వనమహోత్సవం. కౌన్సిలర్ నిర్వహించే బాధ్యతలపైన మరియు పట్టణాలకు సంబంధించిన అంశాలపై నిపుణులకే శిక్షణ అవగాహన కల్పించేందుకు CDMA ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి భీంగల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు.హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI)లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, వైస్ చైర్‌పర్సన్ చంటి లతా నర్సయ్యతో పాటు కౌన్సిలర్లు ఆరెపల్లి శ్రీజనాగేంద్రబాబు, పర్శ కుశలతఅనంతరావు, తోట సతీష్, బోదిరే లావణ్య నర్యయ్య, అంజుమ్ అలీ, సందీప్, నీలం రవి, సంగ్యా నాయక్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు