CRPపై ఆరోపణలు.. విచారణకు MEO ఆదేశాలు, MROకు బాధితుల ఫిర్యాదు
పయనించే సూర్యుడు జూన్ 31 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లాసూళ్లూరుపేటలో MEO Officeలో CRPగా విధులు నిర్వహిస్తున్న వేలూరు అంకయ్య పై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు MEO కార్యాలయంతో పాటు MRO Officeలోనూ ఫిర్యాదులు సమర్పించారు. బాధితుల అర్జీలను స్వీకరించిన MEO, ఆరోపణల విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రత్యేక విచారణ ద్వారా పూర్తి వివరాలు సేకరించి, ఆరోపణల్లో నిజం ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఇదే అంశంపై ఫిర్యాదులు అందుకున్న MRO, MEOతో చర్చించి పూర్తి సమాచారం తెలుసుకుంటామని తెలిపారు. విచారణలో వెలుగులోకి వచ్చే వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.