తెలంగాణ

దుర్గామాత కుంకుమార్చన పూజలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

దుర్గామాత కుంకుమార్చన పూజలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

పయనించే సూర్యుడు అక్టోబర్ 15 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )పాపిరెడ్డిగూడ: పాపిరెడ్డిగూడ గ్రామంలో సర్పంచ్ శశిరేఖ యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత కుంకుమార్చన పూజా కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో శాంతి, ఐకమత్యం, అభివృద్ధి వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు.సర్పంచ్ శశిరేఖ యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత తదితరులు పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS