*సర్పంచ్ రామలింగం గౌడ్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
( పయనించే సూర్యుడు అక్టోబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం కాశిరెడ్డిగూడ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ రామలింగం గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.అనంతరం సర్పంచ్ రామలింగం గౌడ్ మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి పేదవాడికి అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారులెవ్వరూ సంక్షేమ ఫలాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామాభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్,గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామస్తులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.