తెలంగాణ

ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీరు స్థాయికి తగ్గి మాట్లాడుతున్నారు ,

ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీరు స్థాయికి తగ్గి మాట్లాడుతున్నారు ,

పయనించే సూర్యుడుD,30,10,2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్,నిజామాబాదు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గడ్డం నర్సారెడ్డి పత్రిక సమావేశం లో మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీ స్థాయికి తగ్గి, ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారు ఎందుకంటే గదా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తన సొంత గ్రామమే సరిగా అభివృద్ధికి నోచుకోకపోవడం చాలా బాధాకరం ఈ విషయమే స్థానిక కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జజ్ సునీల్ రెడ్డి కి దృష్టికి తీసుకెళ్లగా వారు నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లడం జరిగింది . వారు వెంటనే స్పందించి గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ కాలనీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్లాట్లు ఇచ్చిందో ఆ కాలనీలో వారు తిరిగి అక్కడ మౌలిక సదుపాయాల విషయంలో పరిశీలించడం జరిగింది స్థానిక ప్రజల కోరిక మేరకు అవసరాల మేరకు సిసి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ గాని అక్కడ లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారని చూసి వారు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సీసీ రోడ్ల,డ్రైనేజ్,ఎలక్ట్రిసిటీ పోల్స్ మరియు లైట్లు ఎస్టిమేషన్ వేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించడం జరిగింది కానీ ప్రశాంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి నా గ్రామానికి నాకు చెప్పకుండా ఎట్లా వస్తావు అనే విధంగా వ్యవహరిస్తున్నారు మంత్రి హోదాలో మీరు చేయలేని పనులు మా స్థానిక నాయకులు చేద్దామనుకుంటే గ్రామం బాగుపడితే ఓర్వలేక పోతున్నారు మీ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు ప్రశాంత్ రెడ్డి మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి 10 సంవత్సరాల అధికారంలో ఉండి బాల్కొండ నియోజకవర్గంలో పేదలకు ఇల్లు ఇవ్వాల్సింది పోయి ఎక్కడ కూడా ఇవ్వకుండా కొన్ని గ్రామాలలో డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో హడావిడి చేసింది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యంమే కొందరికి అర్హత లేనివారికి డబుల్ బెడ్ రూంలు ఇచ్చారని కాంగ్రెస్ నాయకులం ప్రశ్నిస్తే అరెస్టు చేయించలేదా మీ BRS కార్యకర్తలు ఎంతకు అమ్ముకున్నారో మీకు తెల్వదా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ముడుపులు ఎవరి వద్దనైనా తీసుకుంటే నిరూపించండి లబ్ధిదారుల ఎంపిక విషయంలో మీరు చేస్తున్న ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నం

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS