
పయనించే సూర్యుడుD,30,10,2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లోబాల్కొండ: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఢిల్లీకి బయలుదేరారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు..