తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో అనర్హుల పేర్లు..ప్రజావాణిలో ఫిర్యాదు…

ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో అనర్హుల పేర్లు..ప్రజావాణిలో ఫిర్యాదు…

రుద్రూర్, సెప్టెంబర్ 28 (పయనించే సూర్యుడు): రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడతలో మంజూరు చేయదలచుకున్న ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో అర్హుల పేర్లు ఉన్నాయని గ్రామ సర్పంచ్ కుర్లేపు గంగాధర్ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ వాళ్లు సర్పంచ్ సంతకం లేకుండానే లిస్టు ను తయారు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కార్యదర్శి శ్రావణ్ పై తమ విధుల దృష్ట్యా లోపాలను ఫిర్యాదు రూపంలో జిల్లా కలెక్టర్, ఎంపిడిఓ కు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు పట్టించుకోవడం లేదన్నారు. గత 4 సంవత్సరాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తూ రాజకీయ వ్యవహారాలు జరుపుతున్నారని, విషయంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS