పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి) (గ్రంధి నానాజీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల సేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా భారతీయ చిన్నారుల కలలు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు మట్టపర్తి మహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 25 సంవత్సరాల సేవ-వికసిత్ భారత్ 2047 అంశంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు విద్యార్థులే ప్రధాన శక్తి అని అన్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ప్రతిభను గుర్తించి చదువు,క్రీడలు,సృజనాత్మకత,నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు.నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు,నైపుణ్యాలను పెంపొందించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో నేటి విద్యార్థుల పాత్ర కీలకమని,దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఆలోచనను చిన్ననాటి నుంచే పెంపొందించాలని పేర్కొన్నారు.అనంతరం ప్రధానోపాధ్యాయులు మహాలక్ష్మి,పోటీలు నిర్వహించిన ఉపాధ్యాయురాలు ఝాన్సీని అయ్యాజీ వేమా సన్మానించారు.అలాగే వికసిత్ భారత్-2047 నిర్మాణాని కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సలహాలు అందించేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,000 మందిలో చోటు దక్కించుకున్న ఊడిమూడి గ్రామానికి చెందిన రాణి శ్రీవల్లిని ఘనంగా సత్కరించారు.యువత,విద్యార్థుల ఆలోచనలు దేశ భవిష్యత్ ప్రణాళికల్లో ఎంతో విలువైనవని,విద్యార్థులు తమ ప్రతిభను వ్యక్తిగత విజయాలకే పరిమితం చేయకుండా దేశ అభివృద్ధి,సమాజ సేవ,పర్యావరణ పరిరక్షణ,సాంకేతిక అభివృద్ధి రంగాల్లో పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిక్క సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు,సేవా సంకల్ప్ అభియాన్ మండల కన్వీనర్,జిల్లా మాజీ కార్యదర్శి అడ్డాల వెంకటేశ్వరరావు,రాణి శ్రీనివాస్ శర్మ,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మేడిది సత్యనారాయణ,జిల్లా కార్యవర్గ సభ్యుడు తోలేటి సుబ్బారావు,ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వరరావు,ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు దిగుమర్తి ఏడుకొండలు,సీనియర్ నాయకుడు కుడుపూడి సూర్యనారాయణ,మండల ఉపాధ్యక్షుడు చీకరమెల్లి సుబ్రహ్మణ్యం,మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు కండవల్లి శ్రీనివాస్ దీక్షితులు,కార్యవర్గ సభ్యుడు ర్యాలీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.