పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వివిధ మోర్చాలలో జిల్లా స్థాయి పదవులు పొందిన నాయకులను మున్సిపల్ చైర్మన్ నివాసంలో ఘనంగా సన్మానించారుఈ సందర్భంగా నూతనంగా జిల్లా స్థాయి బాధ్యతలు చేపట్టిన నాయకులకు మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి మరియు కౌన్సిలర్లు శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని నాయకులకు సూచించారు.నూతన బాధ్యతలు పొందిన నాయకులు తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర మీడియా కో-కన్వీనర్ కొండ సాయి ప్రసాద్ గౌడ్, బీజేవైఎం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింధె గంగా ప్రసాద్, ఉపాధ్యక్షులు ఆకుల రంజిత్, ఎస్ సి. మోర్చా ప్రధాన కార్యదర్శి మాణిక్,అప్పల రాకేష్, కార్యదర్శి స్వరాజ్, కార్యవర్గ సభ్యులు భీమా శంకర్, అదొల్ల హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.