ఆంధ్రప్రదేశ్

కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్షకు వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్ పినిపే శ్రీకాంత్ సంఘీభావం

కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్షకు వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్ పినిపే శ్రీకాంత్ సంఘీభావం

పయనించే సూర్యుడు అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురంలో జరుగుతున్న శాంతియుత నిరసన శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పినిపే శ్రీకాంత్ సందర్శించారు. దీక్షలో కూర్చున్న కాంట్రాక్ట్ నర్సులు, పారామెడికల్ సిబ్బందితో కలిసి ఆందోళనలో పాల్గొని తన పూర్తి సంఘీభావం ప్రకటించారు. ​ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ నర్సులు, హెల్త్ వర్కర్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి న్యాయమైన సమస్యలు, డిమాండ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, నాయకురాలు కల్వకొలను ఉమలతో పాటు పలువురు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని నిరసన తెలుపుతున్న ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS