పయ నించే సూర్యుడు అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామ పంచాయతీ-1 లో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం అందరూ ఐక్యతతో ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్య పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి, పి.గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ కటికి రెడ్డి తమ్మయ్య నాయుడు, బిజెపి సీనియర్ నాయకులు వేగి వెంకటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు ఏడిద బాబులు తదితరులు పాల్గొన్నారు.