ఆంధ్రప్రదేశ్

కాట్రేనికోనలో ఘనంగా గణపతి నవరాత్రుల ముగింపు అన్న సమారాధన

కాట్రేనికోనలో ఘనంగా గణపతి నవరాత్రుల ముగింపు అన్న సమారాధన

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 30 ముమ్మడివరం ప్రతినిధి,గ్రంధి నానాజీ:_ కాట్రేనికోశ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవస్థానంలో వేంచేసి ఉన్న ఆది గణపతి స్వామికి గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు.ఆణివిళ్ల వెంకటరమణ శాస్త్రి సేవా ట్రస్ట్ తరపున మరియు వివిధ దాతల సహకారంతో ఉదయం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సంకటహర చవితి పండుగ సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక అభిషేకాలు,గరిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం మహా నివేదన చేసి అన్న సమారాధన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పలువురు సేవా భక్తులు,మహిళలు పాల్గొని తమ వంతు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS