పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలుసెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (CEC) జ్ఞానేశ్వర్ రావు SIR ప్రక్రియ పేరుతో సొంత అజెండాతో వ్యవహరిస్తూ, ఎలక్షన్ కమిషనర్ల సలహాలు, సూచనలు తీసుకోకుండా అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాల గుర్రం బాబు ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ కి (SIR ) జరుగుతున్న ఓట్ల తొలగింపు గురించి వినతి పత్రం అందజేశారు కార్యక్రమం ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాల గురవం బాబు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాకు చెందిన ఏడు నియోజకవర్గాల ఇన్చార్జులు, నాయకులు పాల్గొన్నారు.ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేశ్వర్ రావు SIR పేరుతో లక్షలాది ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఎలక్షన్ కమిషనర్ల సలహా కూడా తీసుకోకుండా సొంత అజెండాతో పని చేస్తున్నారు.ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి గారి ఆదేశాలతో, మా జిల్లా అధ్యక్షులు బాల గురవం బాబు గారి నాయకత్వంలో ఈ పోరాటం చేస్తున్నాము కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ చైర్మన్ దాసరి రత్నం, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ తలపా దామోదర్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నంబాకం హరికృష్ణ, జిల్లా కిసాన్ అధ్యక్షులు జోగి వినోద్, కేకేసి జిల్లా అధ్యక్షులు చిరంజీవి, జిల్లా కార్యదర్శి ఇళయరాజా, సూళ్లూరుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్వేత, కార్యదర్శి బొగ్గుల సురేష్, సూళ్లూరుపేట టౌన్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి, సూళ్లూరుపేట టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.కె యాసిన్ భాష తదితరులు పాల్గొన్నారు.CEC తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.