ఆంధ్రప్రదేశ్

ముమ్మిడివరంలో రేపు కిసాన్ మేళాఏయిమ్స్ కళాశాలలో ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ముమ్మిడివరంలో రేపు కిసాన్ మేళాఏయిమ్స్ కళాశాలలో ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 (ముమ్మిడివరం ప్రతినిధి,గ్రంధి నానాజీ:) ది.30.09.2026వ తేదీ బుధవారం వారం ఉదయం 10 గంటలకు ముమ్మిడివరం మండలం ఏయిమ్స్ కళాశాల ఆడిటోరియంలో ముమ్మిడివరం నియోజకవర్గ ప్రభుత్వ విప్,గౌరవ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు,డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారి కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.కిసాన్ మేళాలో జిల్లా వనరుల కేంద్రం నుండి సైంటిస్టులు రైతులతో మమేకమై వ్యవసాయంలో రైతులు అవలంబిస్తున్న పద్ధతులు,చిరుసంచుల ప్రదర్శన అనగా నూతన వంగడాలు,ప్రకృతి వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు,అధిక ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గకుండా యూరియా సమన్వయం పాటిస్తూ ఖర్చు తగ్గించే విధంగా వ్యవసాయ పెట్టుబడులు,స్టాళ్ల ఏర్పాటు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండలంలోని రైతులందరూ పాల్గొనాలని మండల వ్యవసాయ అధికారి బి.మృదుల తెలిపారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS