ఆంధ్రప్రదేశ్

ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం:ఎమ్మెల్యే ఆనందరావువరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సభ,ర్యాలీ-అక్టోబర్ 10న స్వచ్ఛ కోకో బీచ్

ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం:ఎమ్మెల్యే ఆనందరావువరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సభ,ర్యాలీ-అక్టోబర్ 10న స్వచ్ఛ కోకో బీచ్

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 29 (ముమ్మిడివరం ప్రతినిధి,గ్రంధి నానాజీ): నేటి ఆధునిక జీవనశైలి,ఒత్తిడి,ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని,ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పిలుపునిచ్చారు.వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మంగళవారం అమలాపురం కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న కల్యాణమండపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు,మెడికో విద్యార్థులు రోజూవారీ పనిలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని,వారికి విశ్రాంతి, రీఫ్రెష్ మెంట్ ఇచ్చేలా ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు అవసరమని తెలిపారు. సభలో కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు స్వచ్ఛ అమలాపురం ప్రతిపాదించగా,ఎమ్మెల్యే స్పందిస్తూ స్వచ్ఛ కోకో బీచ్ కార్యక్రమం చేపడదామని కోరారు.అందుకు సానుకూలంగా స్పందించిన చైతన్యరాజు అక్టోబర్ 10న కిమ్స్ మెడికో విద్యార్థులు,వైద్యులతో కలిసి కోకో బీచ్ లో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు స్వచ్ఛ బీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోనూ,అమలాపురం నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని,కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు ఆరోగ్యం,పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.అనంతరం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి కిమ్స్ హాస్పిటల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు,ఎండీ రవివర్మ,అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు,బోనం సత్తిబాబు,శర్మ,వైద్యులు,మెడికల్ విద్యార్థులు,సిబ్బంది,కూటమి నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS