మక్తల్: జనసేన రాష్ట్ర యువజన విభాగంలో డా.మణికంఠ గౌడ్
{పయనించే సూర్యుడు} న్యూస్ జనవరి 9 మక్తల్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం కమిటీలో మక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ను నియమించినట్లు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. మణికంఠ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణ, కష్టపడి పని చేసినందుకు అతి తక్కువ కాలంలోని రాష్ట్ర నాయకత్వం గుర్తించి రాష్ట్రస్థాయి యువజన విభాగంలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.




