ఆంధ్రప్రదేశ్

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ – విజయవాడలో 25 కోట్ల చిన్నారుల కలలు కార్యక్రమం

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ – విజయవాడలో 25 కోట్ల చిన్నారుల కలలు కార్యక్రమం

పయ నించే సూర్యుడు అక్టోబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కోనసీమ జిల్లా కన్వీనర్ నాగిరెడ్డి సతీష్ రావు, కో-కన్వీనర్ కాపిశెట్టి కనికేశ్వరరావు ఘన సత్కారం – ముమ్మిడివరం రవీంద్ర స్కూల్ విద్యార్థిని పొద్దోకు హర్షితకు మూడో బహుమతి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా వికసిత్ భారత్ @ 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో 25 కోట్ల చిన్నారుల కలలు అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి చిత్రలేఖనం మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజయవాడ ది వెన్యూ కన్వెన్షన్ హాల్ నందు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్ జీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు గనుల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హాజరయ్యారు. 25 కోట్ల చిన్నారుల కలలు రాష్ట్ర సేవా సంకల్ప కన్వీనర్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ నాగిరెడ్డి సతీష్ రావును కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కో-కన్వీనర్ కాపిశెట్టి కనికేశ్వరరావును కూడా ఘనంగా సత్కరించారు. వక్తృత్వ పోటీల్లో డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రవీంద్ర హైస్కూల్ 6వ తరగతి విద్యార్థిని పొద్దోకు హర్షిత మూడవ స్థానంలో గెలుపొంది కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చేతుల మీదుగా రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రం, మెడల్ అందుకుంది. ఈ సందర్భంగా రవీంద్ర స్కూల్ ప్రధానోపాధ్యాయులు పొత్తూరి వీర వెంకట సత్యనారాయణ మూర్తి రాజును, స్కూల్ యాజమాన్యాన్ని సతీష్ రావు అభినందించారు. కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న జిల్లా బిజెపి కుటుంబ సభ్యులకు, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS