అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత: మక్తల్ ఎస్ఐ రాజు
:పయనించే సూర్యుడు జూన్ మక్తల్: మాగనూరు నుంచి నారాయణపేటకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ టిప్పర్‌ను మక్తల్ శివారులో మక్తల్ పోలీసులు పట్టుకున్నట్లు మక్తల్ ఎస్ఐ రాజు తెలిపారు.ఈ సందర్భంగా టిప్పర్‌ను తనిఖీ చేసి డ్రైవర్‌ను విచారించగా, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసులో డ్రైవర్ నరేష్ (బాపనపల్లి, దామరగిద్ద మండలం), టిప్పర్ యజమాని రాజు (వల్లంపల్లి, ఉట్కూర్ మండలం)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.అక్రమ ఇసుక రవాణాపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందని, నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇసుక రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ రాజు హెచ్చరించారు.