ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి….
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
( పయనించే సూర్యుడు జూన్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సార్ ) కార్యక్రమంలో భాగంగా ఫరూక్నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్ ( బి ఎల్ ఓ )తో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహణ, ఇంటింటి సందర్శన, ఓటరు వివరాల నమోదు, సవరణల ప్రక్రియ తదితర అంశాలను పరిశీలించి, కార్యక్రమం అమలవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా రాయికల్ శ్రీనివాస్ మాట్లాడుతూ…18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా తదితర వివరాలను ఒకసారి పరిశీలించి, ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని సూచించారు.ప్రజలకు అవసరమైన డిజిటల్ మరియు ఫిజికల్ సేవలను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున నియమితులైన బూత్ లెవల్ ఏజెంట్లు (బి ఎల్ ఒ లు) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా ఎంతో కీలకమని పేర్కొంటూ, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం, వివరాలను సరిచేసుకోవడం, కొత్త ఓటర్లను చేర్చడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.”బలమైన ప్రజాస్వామ్యానికి ప్రతి ఓటు అమూల్యమైనది. ‘నా ఓటు – నా హక్కు’ అనే భావనతో ప్రతి ఒక్కరూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సార్ ) కార్యక్రమంలో భాగస్వాములు కావాలి” అని రాయికల్ శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రామేశ్వరం గ్రామ సర్పంచ్ మానస మల్లేష్, జీపీఓ భార్గవి, అంగన్వాడీ సూపర్వైజర్ విమల, బీఎల్వో జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రమేష్, గ్రామ అధ్యక్షుడు నర్సింలు, బీఎల్ఏలు పల్లపు రమేష్, చిన్నయ్య, యాదయ్య, రాజు, కారోబార్ శ్రీశైలం, సిద్దు, రాయికల్ అంగన్వాడీ టీచర్లు మమత, సుజాత, ఎర్రోల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.