అమలాపురంలో బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం ఘనంగా నిర్వహణ

July 25, 2026 | సినిమా వార్తలు

ప యనించే సూర్యుడు జూలై 25 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా పదాధికారుల సమావేశం అమలాపురంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి శ్రీ నూకల మధుకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పి.గన్నవరం మండల శాఖ అధ్యక్షులు శ్రీ తిక్క సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి శ్రీ నూకల మధుకర్‌ గార్ని, జిల్లా ఇన్చార్జ్ శ్రీ కారంకి శ్రీనివాస్ గార్లను, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ శ్రీ చీకరమెల్లి శ్రీనివాసరావు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ చెరుకూరి గోపాలకృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ గనిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి చిలకమర్రి కస్తూరి, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు శ్రీ విల్ల దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొప్పనాతి దత్తాత్రేయ, జిల్లా కార్యదర్శి శ్రీమతి మోకా ఆదిలక్ష్మి, శ్రీమతి చిట్టూరి రాజేశ్వరి, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు శ్రీ బుర్ర ఆంజనేయులు, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి మహబూబ్ షాహేరాతో పాటు పలువురు పార్టీ నాయకులు, పదాధికారులు పాల్గొన్నారు.సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, రాబోయే కార్యక్రమాల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు.

🌐 Select Language:
📰 ePaper