వెంకటాయపాలెం కాలువ విషాదం.. మృతుల కుటుంబాలకు మంత్రి సుభాష్ పరామర్శ
పయనించే సూర్యుడు జూలై 25 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ముగ్గురు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందిమంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం రూరల్:రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం కాలువలో ప్రమాదవశాత్తు ముగ్గురు యువ విద్యార్థులు మృతి చెందిన ఘటన పట్ల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి, ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదకర సంఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసిందని పేర్కొన్నారు.ప్రమాదంలో మృతి చెందిన కనికెళ్ల రంజిత్ (15), పసలపూడి గ్రామానికి చెందిన బొక్కా వీరేంద్ర (19), పడమర కండ్రిగకు చెందిన వసుధ పావని (14) కుటుంబాలను మంత్రి సుభాష్ స్వయంగా పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబ సభ్యుల దుఃఖాన్ని పంచుకుంటూ వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్న వయస్సులోనే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొందని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో ధైర్యం అవసరమని పేర్కొన్నారు. ఆపద సమయంలో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాల విషయంలో ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొని మృతులకు నివాళులర్పించారు. మంత్రి సుభాష్ వెంట ఆర్డీవో సరళావతి, ఇతర అధికారులు, కూటమి పార్టీ నాయకులు తదితరులున్నారు.