PS Telugu News
Epaper

అశ్వాపురం అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి మెమొరాండం అందజేత

📅 21 Apr 2026 ⏱️ 5:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 21,అశ్వాపురం:

అశ్వాపురం గ్రామపంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు గౌరవ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశ్వాపురం జగదాంబ స్వీట్ షాపు నుండి మల్లమ్మ సెంటర్ వరకు అత్యంత రద్దీగా ఉండే రహదారిపై సి.సి రోడ్లు మరియు రోడ్డుకు రెండు వైపులా సైడ్ డ్రైనేజీలను నిర్మించాలని సర్పంచ్ ఎమ్మెల్యే కి వివరించారు. ప్రస్తుతం ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండటం వల్ల నిత్యం పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, రైతులు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వీటితో పాటు గ్రామంలోని వివిధ వార్డుల అవసరాల దృష్ట్యా మరో 30 సి.సి రోడ్లను మంజూరు చేయాలని కోరారు.గ్రామ అవసరాలను, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీసీ రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీల మంజూరు చేయాలని సర్పంచ్ కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, గ్రామ అభివృద్ధికి తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ యొక్క సి.సి రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీలను విడతల వారీగా మంజూరు చేస్తానని తెలియజేస్తూ, వెంటనే సంబంధిత పంచాయత్ రాజ్ ఏ.ఈ కి ఫోన్ చేసి, వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల యొక్క రికార్డులను మరియు ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె కేశవ రెడ్డి పాల్గొన్నారు.

Scroll to Top