ప్రజావాణిలో దరఖాస్తు చేసినందున సబ్ కలెక్టర్ ఆర్మూర్ శ్రీ అభిగ్యాన్ మాలావ్యా తొర్తి గ్రామం సందర్శించినారు
పయనించే సూర్యుడు 21 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్
బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలం తొర్తి గ్రామమునకు చెందిన కొంత మంది రైతులు గ్రామమునకు చెందిన డ్రైనేజి నీళ్ళు తమ పంట పొలాలకు వచ్చి పంటలు నష్టము జరుగుతుంది అనే విషయము ప్రజావానిలో దరఖాస్తు చేసినందున విచారణ నిమిత్తము ఈ రోజు మంగళవారం రోజున సబ్ కలెక్టర్, ఆర్మూర్ శ్రీ అభిగ్యాన్ మాలవ్యా తొర్తి గ్రామము సందర్శించినారు. రైతుల పంట పోలములను, మరియు డ్రైనేజి పరిశీలించి, రైతులు, గ్రామా సర్పంచ్, గ్రామా పెద్దలు, అధికారులు చెప్పిన విషయములు తెలిసుకొని గ్రామా రైతులు, అధికారులు , సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని సామరస్యముగా సమస్యను పరిష్కరించు కోవలసినడిగా సూచ్చిన్చినారు. ఇట్టి కార్యక్రమములో ఏరుగట్ల తహసీల్దార్, MPDO, Dy. EE (Irrigation), MPO, AE (Irrigation), రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
