పెండింగ్‌లో ఉన్న పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ .
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. ఈ రోజు కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పోచమ్మ ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఎమ్మెల్యే గారు అధికారులతో మరియు క్రాంటక్టర్ ను సూచించారు. ఆలయ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే నిధులు మంజూరు […]




