ఆయుర్వేదిక్ హాస్పిటల్ దగ్గర ఉన్న ట్యాంకుకు సరిపడా మిషన్ భగీరథ నీరు అందించాలి
……..డిమాండ్ చేసిన అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 20,అశ్వాపురం: అశ్వాపురం మేజర్ గ్రామపంచాయతీ కావడంతో నీటి వినియోగం అధికంగా ఉంటుందని, అందువల్ల గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా తగినంత మిషన్ భగీరథ నీటి సరఫరా ఉండేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ కోరారు.అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆయుర్వేదిక్ హాస్పిటల్ వద్ద ఉన్న నూటఇరవై కేఎల్ ఓహెచ్‌ఎస్‌ఆర్ వాటర్ ట్యాంక్‌కు గత పది రోజులుగా సరిపడా మిషన్ భగీరథ నీరు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై సర్పంచ్ సదర్ లాల్ మిషన్ భగీరథ గ్రిడ్ సిబ్బందితో మాట్లాడగా, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు.అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కిషోర్ కి సమస్యను వివరించగా, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని సర్పంచ్ తెలిపారు.అశ్వాపురం మేజర్ గ్రామపంచాయతీ కావడం, జనాభా మరియు నీటి వినియోగం అధికంగా ఉండటం దృష్ట్యా, ఆయుర్వేదిక్ హాస్పిటల్ వద్ద ఉన్న నూటఇరవై కేఎల్ ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుకు సరిపడా మిషన్ భగీరథ నీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా నీటి సరఫరాను సక్రమంగా నిర్వహించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సర్పంచ్ బానోత్ సదర్ లాల్ కోరారు.