ఝరి బి గ్రామంలో భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జన వేడుకలు

September 20, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి బి గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. భజన బృందం, భజంత్రీలతో కలిసి గ్రామంలోని వివిధ దేవాలయాలతో పాటు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు.గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భజనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు. అనంతరం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమంలో సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షులు దొంతుల రమేష్, ఉపాధ్యక్షులు ఈశ్వర్ పటేల్ గణేష్ కమిటీ మండల సభ్యులు తెలుగు భజన మండలి సభ్యులు గ్రామస్తులు యువకులు, మహిళలు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper