వినాయకుడి నూతన మండప నిర్మాణానికి భూమి పూజ

August 10, 2026 | తెలంగాణ

పాల్గొన్న సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ ఉప సర్పంచ్ తావు సింగ్ నాయక్ వార్డు సభ్యులు

వినాయక కమిటీ సభ్యులు

( పయనించే సూర్యుడు ఆగస్టు 11 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా పరిధిలోని వినాయక మండపాన్ని పునర్నిర్మాణంలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న వినాయక మండపాన్ని సోమవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కడియాలకుంట తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహన్ అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. త్వరలో వచ్చే వినాయక చవితి వరకు ఈ మండపాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండ సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ ఉప సర్పంచ్ తావు సింగ్ నాయక్ వార్డు సభ్యులు తావు సింగ్, దేవి రవీందర్, తండా పెద్దలు శంకర్ నాయక్ రాత్లావత్ రమేష్ వివోఏ రాజు వినాయక కమిటీ మెంబర్స్ రాజేష్ దీప్లా శివ రాజు మరియు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper