ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి
బ్యాంకుల ముసుగు లో కూలీలను వేధిస్తే ఊరుకోం
జూన్ 20 21 22 న మహబూబ్నగర్ లో జరిగే కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయండి
(సిపిఐ ) ఎం జిల్లా కమిటీ సభ్యులు గోవింద్ రాజ్
కార్మిక సంఘం మండల కార్యదర్శి అశోక్
:పయనించే సూర్యుడు జూన్15 మక్తల్: మక్తల్ మండలం దాసరి దొడ్డి గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనులను సి ఆర్ గోవింద్ రాజ్, అశోక్ లు సోమవారం సందర్శించారు ఈ సందర్భంగా వ్యవసాయ కూలీలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ. వ్యవసాయ కార్మికు లు పోరాడి సాధించుకున్న మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కొనసాగించాల నీ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా పేరు మారుస్తూ విబిజీ రామ్ జి చట్టం తేవడం మహాత్ముని అవమానించడమే అన్నారు. వి బి జి రామ్ జి రద్దు కోసం పోరాడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశంలో మండల కార్యదర్శి అశోక్ తో కలిసి కూలీలతో ముచ్చటించారు. కూలీలకు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పని ప్రదేశంలో రెండు పూటల ఫోటో క్యాప్సర్ తీసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో మంచినీటి వసతి, ప్రతిరోజు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, తట్ట, బుట్ట, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, పారలు, టెంట్లు సరఫరా చేయాలని కోరారు. అలాగే కొలతల పద్ధతిని రద్దుచేసి రోజు కూలి రూ” 800 ఇవ్వాలని ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జూన్ 20 న ఉమ్మడి మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4 వ మహా బహిరంగ సభకు ముఖ్య అతిథి : కామ్రేడ్ మాణిక్ సర్కార్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి హాజరవుతున్నారని తెలిపారు. కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు ఈ మహాసభలలో పాల్గొంటారని అన్నారు. మండలంలోని వ్యవసాయ కూలీలు, రైతులు, ప్రజలు, మహిళలు యువకులు, విద్యార్థులు మేధావులు అత్యధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో దాసరి దొడ్డి వ్యవసాయ కూలీలు లింగప్ప, వెంకటప్ప, గౌరప్ప, తిమ్మయ్య, శంకరప్ప, సూగమ్మ, వసంతమ్మ, మారెమ్మ, పద్మమ్మ, మలన్ బి, తాయమ్మ తదితరులు పాల్గొన్నారు.