నిర్మల్ పట్టణంలోని పీజీ కాలేజీ ఆవరణంలో కోతుల పట్టివేత కార్యక్రమం విజయవంతం..

June 16, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ పట్టణంలోని పీజీ కాలేజీ పరిసర ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించేందుకు నిర్వహించిన ప్రత్యేక కోతుల పట్టివేత కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 96 కోతులను సురక్షితంగా పట్టుకొని కవ్వాల్ అటవీ ప్రాంతానికి తరలించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కోతుల బెడద నుంచి ఉపశమనం కల్పించినందుకు మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భద్రత, సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుమలత రాఘవేంద్ర చారి, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper