ఉపాధ్యాయుల సేవలు సమాజానికి చిరస్మరణీయం
మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి
పాపిరెడ్డిగూడ హైస్కూల్ హెచ్‌ఎం కోప్పునూరి శ్రీశైలం పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం
( పయనించే సూర్యుడు ఆగస్టు 31 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) పాపిరెడ్డిగూడ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కోప్పునూరి శ్రీశైలం పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి హాజరై పదవీ విరమణ చేస్తున్న హెచ్‌ఎం శ్రీశైలంను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఒక ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా శ్రీశైలం అందించిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ఉన్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.పదవీ విరమణ అనేది సేవలకు ముగింపు కాదని, జీవితంలో మరో కొత్త అధ్యాయానికి ప్రారంభమని పేర్కొంటూ, శ్రీశైలం భవిష్యత్తులో మరింత సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శశిరేఖ యాదయ్య, మహిళా అధ్యక్షురాలు రాణి, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొని పదవీ విరమణ పొందుతున్న ప్రధానోపాధ్యాయులు కోప్పునూరి శ్రీశైలంకు శుభాకాంక్షలు తెలిపారు.