కృష్ణవేణీ పాఠశాల విద్యార్థుల క్షేత్ర స్థాయి పర్యటన

August 11, 2026 | తెలంగాణ

ప్రిన్సిపాల్ రఫత్ సుల్తానా ఆధ్వర్యంలో పర్యటన

( పయనించే సూర్యుడు ఆగస్టు 12 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కృష్ణవేణీ పాఠశాల విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపాల్ రఫత్ సుల్తానా ఆధ్వర్యంలో 8,9వ తరగతి విద్యార్థులను వ్యవసాయ క్షేత్ర పర్యటన కై శ్రీరంగపూర్ గ్రామ రైతు గ్రామ సర్పంచ్ రమేశ్ మరియు డిప్యూటీ సర్పంచ్ సుమేర్ ఆధ్వర్యంలో వారి పొలానికి తీసుకొని వెళ్ళారు.అక్కడ విద్యార్తులు పంట నాట్ల నుండి దిగుబడి వరకు ఉండే విధానం మరియు రైతు శ్రమ అతను పడే కష్టాలను వారిని అడిగి తెలుసు కున్నారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్ ,ప్రవీణ్ కుమార్ వ్యవసాయం కోసం కావలసిన నేల, పనిముట్లు మరియు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల గురించి చాలా విషయాలు విద్యార్ధులకు వివరించారు. ప్రిన్సిపాల్ రఫత్ సుల్తానా మాట్లాడుతూ వ్యవసాయమే ప్రధానంగా వ్యవసాయమే జీవనాధరంగా ఉన్న ఏకైక దేశం మన భారత దేశం అని అన్నారు .మన దేశం సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. తరగతి గదిలోనే విషయాన్ని బోధించే కంటే ఇలా ప్రాక్టికల్ గా విద్యార్ధులకు వివరించడం ద్వారా వారు త్వరగా అర్థం చేసుకుంటారు.ఉప సర్పంచ్ మాట్లాడుతూ భారత దేశానికి వెన్నెముక అయినటువంటి రైతుల గురించి , వ్యవసాయ కూలీల గురించి వ్యవసాయం గురించి వారి కష్టనష్టాల అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper