ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

August 11, 2026 | తెలంగాణ

మధురా పూర్ అంగన్వాడి కేంద్రంలో కార్యక్రమం

పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ విమల

( పయనించే సూర్యుడు ఆగస్టు 12 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని మధురాపూర్ గ్రామపంచాయతీ లోని అంగన్వాడి కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి టీచర్స్ సరస్వతి వనజ పద్మ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహించారు. అదేవిధంగా చిన్నపిల్లలకు అన్న ప్రసన్న కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ విమల గ్రామపంచాయతీ కార్యదర్శి రాధా జిపిఓ యాదగిరి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. తల్లిపాలు పసిబిడ్డలకు అమృతం అని అప్పుడే పుట్టిన పిల్లల నుండి 6 నెలల వరకు తల్లిపాలులను మాత్రమే తాగించాలని అన్నారు. తల్లిపాల ద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని పిల్లలు ఎదగడానికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మరియు ఆశ వర్కర్లు రజిత కవిత గర్భిణీలు బాలింతలు పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper