PS Telugu News
Epaper

ఏబీఎన్ కార్యాలయంపై దాడిని ఖండించిన కాట్రేనికోన ప్రెస్ క్లబ్

📅 07 Apr 2026 ⏱️ 3:00 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ముమ్మిడివరం ప్రతినిధి

​హైదరాబాద్‌లోని ఏబీఎన్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని కాట్రేనికోన ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా కాట్రేనికోన ప్రెస్ క్లబ్ లో మంగళవారంఏర్పాటు చేసిన అత్యసర సమావేశంలో అధ్యక్షుడు పిఎస్ నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలు, ప్రసార మాధ్యమాలపై దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. నిజాన్ని, నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్న మీడియా గొంతు నొక్కాలని చూడటం, భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గం అని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా పరిగణించాలని, దాడికి పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంబాల విష్ణు, మట్టపర్తి రవీంద్రనాథ్, కే.సురేష్ , గంటి బోస్ జగడం శ్రీనివాస్, ఎం శ్రీహరి, గ్రంధి నానాజీ, ఎన్ నాని బాబు, కొంకి రవి, జీ బ్రహ్మాజీ, పీవీ రమణ, డి రవి,తాడి శ్రీనివాస్, తదితరులు ఈ దాడిని ఖండించారు.

Scroll to Top