గోవాలో వైభవంగా రాయపురెడ్డి రాజా కుమారుడి వివాహం

August 26, 2026 | సినిమా వార్తలు

పయనించు సూర్యుడు ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)సీనినిర్మాత రాయపురెడ్డి రాజా కుమారుడి వివాహ వేడుక గోవాలో వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ పెళ్లి కుమారుడిని ఆశీర్వదించి సంతోషకరమైన వైవాహిక జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి గుంటూరు జిల్లా ఇంఛార్జి యాళ్ల దొరబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, మండేల బాబీ, బొర్రా చిట్టిబాబు, కొమ్ముల సురేష్, అడపా శ్రీను, వాసంశెట్టి చిన బాబు, మద్దాల రాజా, ఇండుగుల ఆనంద్, రంభాల రమేష్ తదితర ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుక సంప్రదాయ పద్ధతిలో వేదమంత్రాల నడుమ జరగగా బంధుమిత్రులు, రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను అభినందించారు. వేడుక అనంతరం ఏర్పాటు చేసిన విందులో అతిథులు పాల్గొని సందడి చేశారు.

🌐 Select Language:
📰 ePaper