PS Telugu News
Epaper

కాట్రేనికోన మండలంలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షాలు ఘనవిజయం

📅 30 Apr 2026 ⏱️ 2:21 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలంఈరోజు విడుదలైన పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో కాట్రేనికోన మండలం నుండి హాజరైన 555 విద్యార్థులకు 546మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగినది. మండల ఉత్తీర్ణత శాతం98.37, దీనిలో జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి 50 1 విద్యార్థులకు493మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. ఉత్తీర్ణత శాతం98.40. ప్రైవేట్ పాఠశాలల నుండి 54 మంది విద్యార్థులకు 53 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగినది. ఉత్తీర్ణత శాతం98.14. జిల్లా పరిషత్ హై స్కూల్ పి లక్ష్మీ వాడకు చెందిన విద్యార్థినులు నంద్యాల కార్తీక595 మార్కులు, గాలి దేవర హర్షిని సత్య దుర్గ595 మార్కులతో మండలం ఫస్ట్ సాధించినారు. కాట్రేనికోన హైస్కూల్ విద్యార్థిని అంగాని పరమేశ్వరి 581/600 మార్కులు సాధించింది కాట్రేనికోన మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు

Scroll to Top