PS Telugu News
Epaper

ప్రభుత్వం వడ్ల కొనుగోలు వేగం పెంచాలి హెచ్. నరసింహులు

📅 30 Apr 2026 ⏱️ 2:24 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్30 ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికి వడ్లు కొనడం మాత్రం నత్త నడకగా సాగుతుందని సామజిక కార్యకర్త హెచ్. నర్సింహా తెలిపారు. వారు బిజ్వార్ లో వరి కొనుగోలు కేంద్రము లో వడ్లు అమ్ముటకు వచ్చిన రైతులతో మాట్లాడారు. మూడు, నాలుగు రోజులు వడ్లు ఆరపెట్టి అమ్ముదాం అంటే కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. చాలా మంది రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనడం ఆలస్యం కాడడం వలన ప్రైవేట్ కు అమ్ముకొని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వడ్ల కొనుగోలులో వేగం పెంచి సన్న, చిన్నకారు రైతులకు మేలు చేయాలని కోరారు. సన్న వడ్లకు ధాన్యం డబ్బులతో పాటు 500 రూపాయల బోనస్ డబ్బులు కూడా ఏకకాలంలో రైతుల ఖాతాలలో జామ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Scroll to Top