కాట్రేనికోన మావుళ్ళమ్మ తల్లి కి ఘనంగా ఆషాఢ మాస సారె

August 3, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు ఆగస్టు 3 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కాట్రేని కోన గ్రామంలోని వేంచేసియున్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మ వారికి ఆదివారం ఘనంగా ఆషాఢ మాస సారె సమర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు అనివిల్ల పనికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, సారె సమర్పణతో వేడుకలు జరిగాయి. గ్రామంలోని మహిళలు అందరూ వచ్చి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలు , చలివిడి , వడపప్పు , పానకాలు చీరలు , సారె సమర్పించారు. ఈ కార్యక్రామానికి అనివిల్ల రామ కృష్ణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసారు . భక్తులు తమ మొక్కుబడుల మేరకు చీరలు , స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు తదితర పూజా సామగ్రిని తీసుకువచ్చి అమ్మవారీకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారీ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు

🌐 Select Language:
📰 ePaper