కాశిరెడ్డిగూడ అంగన్వాడి విద్యార్థులకు దుస్తులు పంపిణీ
పాల్గొన్న గ్రామ సర్పంచ్ రామలింగం గౌడ్
( పయనించే సూర్యుడు జూలై 17 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం కాశిరెడ్డిగూడ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు అంగన్వాడి డ్రస్సులు పంపిణీ కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ రజిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ రామలింగం గౌడ్ పాల్గొని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామలింగం గౌడ్ మరియు గ్రామ సెక్రెటరీ అంగన్వాడీ టీచర్ రజిత మరి వార్డు సభ్యులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.