రక్తదాన శిబిరంలో జనసంద్రంఎమ్మెల్యే కుమారుడు కరణ్, నాయకుల పాల్గొనడం
పయనించే సూర్యుడు జూలై 16 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) అమలాపురం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గని శెట్టి అరవింద్ పుట్టినరోజు సందర్భంగా సన్నవల్లిలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.”రక్తదానం – ప్రాణదానం” అనే నినాదంతో నిర్వహించిన ఈ శిబిరానికి యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. మొత్తం 75 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు కుమారులు అయితాబత్తుల కరణ్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలను అభినందించారు. అమలాపురం క్రెడాయి అధ్యక్షులు మండేల బాబీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మోకా వెంకట సుబ్బారావు, జనసేన పార్టీ నాయకులు సుదా చిన్నా, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీను తదితరులు పాల్గొన్నారు.రక్తదానం చేసిన దాతలకు అతిథులు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ప్రాణాలను కాపాడే ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టినందుకు గని శెట్టి అరవింద్‌ను అందరూ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా అయితాబత్తుల కరణ్ మాట్లాడుతూ, యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండడం అభినందనీయమన్నారు. రక్తదానం వల్ల ప్రమాదంలో ఉన్నవారికి, ప్రసవ సమయంలో ఉన్న మహిళలకు, థాలసీమియా పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారైనా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.గని శెట్టి అరవింద్ మాట్లాడుతూ, పుట్టినరోజును సామాజిక సేవతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశానని అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రతి రక్తదాతకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిబిరం విజయవంతం కావడానికి స్నేహితులు గ్రామ ప్రజలు పార్టీ శ్రేణులు