కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
నృత్యాలతో అల్లరించిన చిన్నారులు

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్నగర్ పట్టణంలోని స్థానిక కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ షాద్నగర్ లో గురు వారం పాఠశాల ఆవరణలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఆనంద ఉత్సాహంతో జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలతో అందరిని అలరించారు. పాఠశాల ప్రిన్సిపల్ రఫత్ సల్తాన పండగ విశిష్టత ను తెలియ చేశారు.ప్రిన్సిపల్ మాట్లాడుతూశ్రీకృష్ణుడు దేవకీ మాతకు 8వ సంతానంగా, ఎనిమిదవ తేదీన శ్రీకృష్ణుడు జన్మించాడు. సంస్కృతంలో జమ్నా అనే పదానికి జననం అని అర్థం అలాగే అష్ట అంటే ఎనిమిది. వీటన్నింటి కారణంగా శ్రీకృష్ణుడి పుట్టిన రోజుకు కృష్ణాష్టమి అనే పేరు వచ్చింది.. అని వివరించారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను ఆకర్షించాయి.కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.